Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paatha Nibandhanalo Ishraayelunu Devudu Korenu Dashama Bhaagam

పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం

Paatha Nibandhanalo Ishraayelunu Devudu Korenu Dashama Bhaagam

Verse
పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం
క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవ యాగం – ఇది శరీర యాగం
Verse
దేవా నా జీవితమిదిగో నీ సొంతం
ప్రతి క్షణం నీ పనికి అర్పితం‖ 2x ‖
నా వరకైతే బ్రతుకుట నీ కోసం
చావైతే ఎంత గొప్ప లాభం‖ 2x ‖
నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం
సజీవయాగముగా నీకు సమర్పితం‖ 2x దేవా ‖
Verse
నా కరములు నా పదములు నీ పనిలో
అరిగి నలిగి పోవాలి ఇలలో
సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో
అలసి సొలసి పోవాలి నాలో‖ 2x నా శరీరము ‖
Verse
నా కాలము అనుకూలము నీ చిత్తముకై
ధనము ఘనము సమస్తము నీ పనికి
నా మరణము నీ చరణముల చెంతకై
నిన్ను మహిమపరిచి నేలకొరుగుటకై‖ 2x నా శరీరము ‖

Related Tags

SurrenderDedicationStewardship