Verse
పాతాళంలో ఆత్మల ఆర్తనాదం
భూలోకంలో సువార్తల సునాదము‖ 2x ‖
మించుతుంది సమయం – పొంచి ఉంది ప్రమాదం
ఎంచుకో స్వర్గం – నరకం‖ 2x ‖
గమనించుకో ఎటు నీ పయనం‖ పాతాళంలో ‖
Verse
ఆరని అగ్ని తీరని బాధ పాతాళమందున్నది
విందు వినోదం బంధువు బలగం ఈ లోకమందున్నది‖ 2x ‖
రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ
రక్షించే వారులేక రోధిస్తారక్కడ‖ 2x పాతాళంలో ‖
Verse
ఇది రంగుల లోకం హంగులు చూపి రమ్మని పిలుస్తున్నది
వాక్యము ద్వారా దేవుడు పిలచినా ఈ లోకం వినకున్నది‖ 2x ‖
ప్రజల కొరకు పాతాళం నోరు తెరుచుకున్నది
ఎంత చెప్పినా లోకం కళ్ళు తెరవకున్నది‖ 2x పాతాళంలో ‖