Chorus
పావనుడా మా ప్రభువా - నీ రక్షణకై స్తోత్రములు
నీ రక్షణకై స్తోత్రములు
Verse
అత్యున్నతమైన దేవా - సింహాసనాసీనుడవు
ఎంతో గొప్పది నీ మహిమ - వర్ణింపజాలను నేను
Verse
పాపపు కుష్ఠుతో పడి చెడిన - ఈపాపిని కరుణించితివి
నా పాపపు డాగులు కడిగి - పరిశుద్ధుని చేసిన విభుడా
Verse
అపవిత్రమగు పెదవులతో - కపటముగా జీవించితిని
అపరాధి నోటిని తెరచి - స్తుతి గీతము నొసగిన ప్రభువా
Verse
నీ క్రయధన మధికము ఎంతో - నా కర్త నిను ప్రణుతింతు
నా కందరి కంటె ఘనుడా - ఓ కల్వరి నాథా యేసు
Verse
మహిమ పరతును ప్రభు యేసు - మహదానందముతో నిరతం
మహోన్నతుడా ప్రభు నిన్ను - మహిమలో ఆరాధించెదను
Verse
నా కనులతో నిను చూచెదను - ఆకసమున దూతల మధ్య
రక్షక త్వరగా రారమ్ము - అక్షయుడా నీకే స్తుతులు