Verse
పావురమా నీ ప్రేమ ఎంత మధురము
పావురమా నీ మనసు ఎంత నిర్మలము
జుంటి తేనె ధార కన్నా
మంచి గోధుమ పంట కన్నా‖ 2x ‖
ప్రేమ మధురము – నీ మనసు నిర్మలము‖ 2x ‖
నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము
నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము
Verse
కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను
ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను‖ 2x ‖
ఎటు చూసిననూ ఎం చేసిననూ
మదిలో నిన్నే తలంచుచున్నాను‖ 2x ‖
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా‖ 2x నా యేసయ్యా ‖
Verse
దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు
పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు‖ 2x ‖
నా వాడు నా ప్రియుడు
మదిలో నిన్నే తలంచుచున్నాడు‖ 2x ‖
ఒకసారి కనిపించి
నీ దారి చూపించవా‖ 2x నా యేసయ్యా ‖