Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Padamulu Chaalani Prema Idi

పదములు చాలని ప్రేమ ఇది

Padamulu Chaalani Prema Idi

Verse
పదములు చాలని ప్రేమ ఇది
స్వరములు చాలని వర్ణనిది‖ 2x ‖
కరములు చాపి నిను కౌగలించి పెంచిన
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
వారిని సహితము కన్న ప్రేమ
ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ
ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
కలువరి ప్రేమ‖ 2x పదములు ‖
Verse
నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
కన్నబిడ్డలే నిను వెలివేసినా‖ 2x ‖
తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
ఆ వేదనంత తొలగించును ప్రేమ‖ ప్రేమ ‖
Verse
మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
స్నేహితులే హృదయమును గాయపరచగా‖ 2x ‖
మేలులతో నింపి అద్భుతములు చేసి
క్షమియించుట నేర్పించెడి ప్రేమా
శాంతితో నిను నడిపించెడి ప్రేమ‖ ప్రేమ ‖

Related Tags

WorshipJesus LoveGods Love