Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Padare Sodarulaara Pammapurinjera Madhu

పదరే సోదరులార పమ్మపురిఁజేర మధు

Padare Sodarulaara Pammapurinjera Madhu

Lyricist: William Daanan
Chorus
పదరే సోదరులార పమ్మపురిఁజేర మధుర జీవాధార పదవిచేకూర
తుది మొదలును ఆపద రేబగలు లేని సదనంబునకు జేర సదయు
డేసునిఁ గూడి‖ పదరే ‖
Verse
ఎన్ని దినములు బ్రతుకు నేమి సౌఖ్యంబు అన్ని విధముల జూడ నధిక
కష్టంబు కన్ను మూసిన నాఁడు మన్ను పాలౌదుము మున్ను జాగ్రత్తనొంద
కున్న నష్టము గల్గుఁ‖ పదరే ‖
Verse
ధరణి బ్రతుకును గోర మరణ భయంబు దరీలేని చింతలఁ దగిలి
నిత్యంబు పరి పరి విధముల పరుగు లెత్తుట లేల నిరతంబును సువార్త
సరణిఁ గన్గొని వడిగఁ‖ పదరే ‖
Verse
ధనము సంపాదించి ఘన మదిక మున్న తనువే సతము గాదు అను
భవము సున్న ఇనుఁ డెంద మావు లను గోర నేపాటి తనివి దీరు నిచ్చో
టను నా పాటే దీరుఁ‖ పదరే ‖
Verse
పరలోక మార్గం బిరుకై గన్పడును జొరగా సంకటములు నెరిజుట్టుకొనును
పరమ జనకుని కృపా వరము తోడుగ నున్న వెరపు నొంద మింక
సరకు సేయుము పద‖ పదరే ‖
Verse
ఇహ స్నేహముల మన కిఁకజాలుఁ జాలు బహు దినంబులు సేయంఁ
బడె నేమి మేలు మహిమ దూతల స్నేహ మమరు నచ్చట మనకు
అహహా యేసుని జూడ నధిక సంతోషంబు‖ పదరే ‖
Verse
మనల తోడ్కొని పోవ ఘనుఁడు యెహోవా యనంబు తన శుద్ధా
త్మను నిచ్చి కావ నెనలేని యడ్డంకు లను దాఁటింపను గృప గనుపర్చి
తోడుగ నునిచె వేగము గూడి‖ పదరే ‖
Verse
భక్తులై యున్నట్టి బంధు మిత్రాడుల రక్తి గుణముతో రంజిల్లఁ
గనినన్ ముక్తి రాజ్యంబుల మురువుతోడ సర్వ శక్తుని మహిమ నా
సక్తితోఁ జూతము‖ పదరే ‖

Related Tags

SalvationChristian LifeHeavenly Home