Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Padhae Padhae Naenu Paadukoanaa Prathichoata Nee Maata Naa Paatagaa

పదే పదే నేను పాడుకోనా ప్రతిచోట నీ మాట నా పాటగా

Padhae Padhae Naenu Paadukoanaa Prathichoata Nee Maata Naa Paatagaa

Chorus
పదే పదే నేను పాడుకోనా ప్రతిచోట నీ మాట నా పాటగా
మరీ మరీ నేను చాటుకోనా మనసంతా పులకించ నీ సాక్షిగా
నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు రాగం నీవే
మమతల మహారాజా - యేసురాజా
మమతల మహారాజ - నా యేసురాజా
Verse
అడగక ముందే అక్కర లెరిగి
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే
బంధాలను పెంచిన భాగ్యవంతుడా
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
బంధాలను పెంచిన భాగ్యవంతుడా‖ పల్లవి ‖
Verse
అలిగిన వేళ అక్కున చేరి
అనురాగం పంచిన అమ్మవు నీవే
నలిగిన వేళ నాదరిచేరి
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే
అనురాగం పంచిన అమ్మవు నీవే
నమ్మకాన్నీ పెంచిన నాన్నవునీవే‖ పల్లవి ‖

Related Tags

PraiseWorshipJesus