Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Padhe Paadanaa Ninne Koranaa Ide Reethigaa Ninne Cheranaa

పదే పాడనా నిన్నే కోరనా ఇదే రీతిగా నిన్నే చేరనా

Padhe Paadanaa Ninne Koranaa Ide Reethigaa Ninne Cheranaa

Lyricist: Joshua Shaik
Chorus
పదే పాడనా నిన్నే కోరనా – ఇదే రీతిగా నిన్నే చేరనా‖ 2x ‖
నీ వాక్యమే నాకుండగా – నా తోడుగా నీవుండగా
ఇదే బాటలో నే సాగనా – ఇదే రీతిగా నా యేసయ్య‖ 2x పదే పాడనా ‖
Verse
ప్రేమను పంచే నీ గుణం – జీవము నింపే సాంత్వనం
మెదిలెను నాలో నీ స్వరం – చూపెను నాకు ఆశ్రయం
నీవే నాకు ప్రభాతము – నాలో పొంగే ప్రవాహము
నీవే నాకు అంబరం – నాలో నిండే సంబరం
నాలోన మిగిలే నీ ఋణం – నీతోటి సాగే ప్రయాణం‖ పదే పాడనా ‖
Verse
మహిమకు నీవే రూపము – మధురము నీదు నామము
ఇదిగో నాదు జీవితం – ఇలలో నీకే అంకితం
నీవే నాకు సహాయము – నిన్న నేడు నిరంతరం
నీవే నాకు ఆశయం – నాలో నీకే ఆలయం
ధరలోన లేరు నీ సమం – నీ ప్రేమధారే నా వరం‖ పదే పాడనా ‖

Related Tags

PraiseWorship