Verse
పదివేలలో అతిప్రియుడు
సమీపించరాని తేజోనివాసుడు
ఆ మోము వర్ణించలేము
స్తుతుల సింహాసనాసీనుడు
నా ప్రభు యేసు‖ 4x ‖
Verse
ఏ బేధము లేదు ఆ చూపులో
ఏ కపటము లేదు ఆ ప్రేమలో‖ 2x ‖
జీవితములను వెలిగించే స్వరం
కన్నీరు తుడిచే ఆ హస్తము‖ 2x ‖
అంధకారంలో కాంతి దీపం
కష్టాలలో ప్రియనేస్తం‖ 2x ‖
నా ప్రభు యేసు‖ 2x పదివేలలో ‖
Verse
దొంగలతో కలిపి సిలువేసినా
మోమున ఉమ్మి వేసినా‖ 2x ‖
తాను స్వస్తపరచిన ఆ చేతులే
తన తనవును కొరడాలతో దున్నినా‖ 2x ‖
ఆ చూపులో ఎంతో ప్రేమ
ప్రేమామూర్తి అతడెవరో తెలుసా‖ 2x ‖
నా ప్రభు యేసు‖ 2x పదివేలలో ‖