Verse
పగటిలో మేఘ స్తంభముగా
రాత్రిలో యగ్ని స్తంభముగా
రక్షకుడవుగా నుండి ప్రభువా
సుఖశాంతితో గాచితివి
Chorus
ధన్య ధన్య ధన్య ప్రభుకు
తానే రక్షణ మన కొసగే
నీ సన్నిధికి నడిపి ప్రభువా
రాత్రింబవళ్ళు గాచితివి
Verse
వాక్యమన్నాతో పోషించి
బండ నీళ్ళను త్రాగించితివి
ఆత్మకు తృప్తి నిచ్చి ప్రభువా
శాంతిని నా కిచ్చితివి
Verse
ఆత్మీయ సుందర హృదయములో
ఆత్మ ప్రాణ శరీరములో
ఆత్మీయజీవ మొసగి ప్రభువా
ఆత్మను మేల్కొలిపితివి
Verse
కానానులోనికి తెచ్చితివి
పరశుధ్ధులతో జేర్చితివి
ప్రణుతించెదను నిన్ను ప్రభువా
సాగిలపడి పూజింతున్