Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Pai nundi digivachche yerushalema nee

పై నుండి దిగివచ్చె యెరుషలేమా నీ

Pai nundi digivachche yerushalema nee

Chorus
పై నుండి దిగివచ్చె యెరుషలేమా
నీ సమయం సంపూర్ణమా ఈ గడియకు . .‖ 2x ‖
రాజాధి రాజునకు ఆహ్వానము
ప్రభువుల ప్రభువుకు జయగీతము‖ 2x ‖
ధగధగ మెరియుచు సొగసుగ నున్నాది ఆ దివ్య నగరి
తళతళ మంటు ప్రతిభింబిస్తుంది‖ 2x ‖
Verse
భూలోక గోళముపై దైవపుత్ర సహవాసం
హృదయాలలో ఒక్కటిగ జేరి ఆత్మ పూర్ణులైతిరి
చేనెలోని ద్రవ్యమా మేలిమైన ముత్యమా
సంతసించు ఉల్లసించు వేచిన నీ దినము వచ్చె
Verse
పరలోక పట్టనము రతనాల రమణియం
వివిధ వర్ణ భూషితము సృష్టి కర్త నైపుణ్యం
జేష్టులైన బృందమా కీర్తిగొన్న నేస్తమా
దవళవస్త్ర సైన్యమా నింగి నేల నేలుమా

Related Tags

PraiseHeavenly CityJerusalem