Verse
పైలం కొడుకా పాపం చేయకురా
యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా
పైలం కొడుకా పైలం కొడుకా
పైలం కొడుకా పైలం కొడుకా
పైలం కొడుకా పాపం చేయకురా
యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా
నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా
Verse
ఉడుకు రక్తము ఉరుకలు పెడ్తది
పాపం చెయ్యమని ఒత్తిడి చేస్తది
పాపమన్నది పాములాంటిది
పగ పడ్తది ప్రాణం తీస్తది‖ పైలం ‖
Verse
మనిషి జీవితం విలువయ్యింది
మరువకు కొడుకా మరణమున్నదని
బ్రతికింది ఇది బ్రతుకు కాదురా
సచ్చినంక అసలాట ఉంటది‖ పైలం ‖
Verse
కత్తి కన్న పదునెక్కువ కొడుకా
మనిషి కోపము మంచిది కాదు
కాలు జారితే తీసుకోవచ్చురా
నోరు జారితే తీసుకోలేము‖ పైలం ‖
Verse
క్రైస్తవ జీవితం విలువయ్యింది
నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా
నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా
నిందలన్ని మొయ్యాలిరా కొడుకా‖ పైలం ‖
Verse
విచ్చలవిడిగా తిరుగుతున్నావు
ఎవరు చూడరని ఎగురుతున్నావు
చూసే దేవుడేసయ్య ఉన్నడు
తోలు తీస్తడు జాగ్రత్త కొడుకా‖ పైలం ‖
Verse
గుట్కలు తినకురా గుటుక్కున చస్తావు
పొగాకు తినకురా పోతవు నరకం
సినిమా చూడకు చింతలు తప్పవు
ఫోజులు కొట్టకు పోతవు నరకం‖ పైలం ‖
Verse
కుమ్మరి పురుగు గుణం చూడరా
బురదల ఉంటది బురదే అంటదు
తామెర పువ్వు బురుదల ఉంటది
వరదొస్తే తల వంచుకుంటది
Verse
ఎన్నో ఆశలు పెట్టుకున్నరా
సేవ చేస్తే నిను చూడాలని
నా కలలను కల్ల చెయ్యకు కొడుకా
కాళ్ళు మొక్కుతా మయ్యగానిరా‖ పైలం ‖
Verse
పొందుకున్నవు రక్షణ నీవు
పోగొట్టుకోకు పోతవు నరకం
నరకమంటే ఆషామాషీ కాదురో
అగ్ని ఆరదు పురుగు చావదు
Verse
ప్రపంచమంతటా పాపమున్నది
మందులేని మాయ రోగమున్నది
నీ పచ్చని జీవితం పాడు చేసుకోకు ఓ కొడకా
నీవు మంచిగా బ్రతికేసయ్యను మహిమపరచు నా కొడకా
నీవు సి ఎం అయితే సంతోషముండదు పి ఎం అయితే సంతోషముండదు
యాక్టర్ అయితే సంతోషముండదు డాక్టర్ అయితే సంతోషముండదు
నీవు సేవ చేస్తే నేను చూడాలి కొడుకా
నువ్వు శ్రమలు అనుభవించాలిరా నా కొడకా‖ పైలం ‖