Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Painamai Yunna Nayya Nee Paadaambuja

పైనమై యున్నా నయ్యా నీ పాదాంబుజ

Painamai Yunna Nayya Nee Paadaambuja

Lyricist: Purushothamu Choudari
Chorus
పైనమై యున్నా నయ్యా నీ పాదాంబుజముల సన్నిధికిఁ ప్రభు యేసు
నాతో నుండవే నీవు దీనుఁడు భవ దా ధీనుఁడ ననుఁ గృప తో నడిపించు
మె దుట నదె సింహ ధ్వానముతో మృతి వచ్చు చున్నది దాని భయోత్పా
తము దొలఁగింపవె‖ పైనమై ‖
Verse
సరణిలో నేఁబోవునపుడు శ్రమ లెన్నెన్నో చనుదెంచి నా పరుగు కడ్డముగా
నిలిచునేమో మరణపు ముళ్లను విరుచుటకును ద ద్దురవస్థలు వెసఁ
దొలఁగించుటకును గరుణానిధి నా సరస నుండుమీ శరణాగతునకు
మరి దిక్కెవ్వరు‖ పైనమై ‖
Verse
దేవా నీ దక్షిణ హస్తముతో దీనులను బట్టెద వెరవకుఁ డను నీ
వాగ్దాత్తమున కిది సమయంబు ఆ వచనము నా జీవాధారము దైవము
తల్లియుఁ దండ్రియు దాతవు నీవే సర్వము నిను నమ్మితి నా త్రోవ
ప్రయాణము తుదముట్టించుము‖ పైనమై ‖
Verse
పొదుగా నీ భక్తియందు డెంద మానందించు నపుడు సందియము
లెన్నెన్నో చనుదెంచి తొందర నిడు నా త్రోవను తద్గా ఢాంధత
మిశ్రమ లణఁగించుటలై సుందరమగు రవి చందంబున నా
ముందట నడువవె ముదమునఁ బ్రభువా‖ పైనమై ‖
Verse
కాలం బయ్యెను రారమ్మనుచు నీల మేఘాకృతితో వచ్చి కాలదండము
జిరజిర ద్రిప్పుచు చాల భయానక లీలన్ మృత్యువు మ్రోల న్నిలిచిన
వేళను దాలిమి దూలి చనుం గా బోలు భవత్కరు ణాలింగన సుఖ
మత్తఱి నొసఁగవె‖ పైనమై ‖
Verse
నీ దివ్య రూపధ్యానంబు నిర్మలాత్మాంతర సౌఖ్యంబు నా దేవుని
ప్రేమామృత సారంబు నీ దాసుని కవి నిరత మొసంగుచు నా దారిని
గల సేదలు దీర్పును నాదియు మధ్యము నంతము లేని పు నాదులుగల
నీ సౌధము జేర్పవె‖ పైనమై ‖
Verse
ఎండమావుల కీడైనట్టి యిహ సౌఖ్యములు త్వరగాఁబోవు నీ నిండు
దరుగని నిత్యానందంబు దండిగ నీయం దుండిన వారి క ఖండామృత
సౌ ఖ్యము లిచ్చెదవట తండ్రీ భవ దు త్తమ దాసుల నీ వుండిన
చోటనె యుంచుము చాలును‖ పైనమై ‖

Related Tags

DevotionalPrayerJourney