Verse
పైనున్న ఆకాశమందునా
క్రిందున్న భూలోకమందునా‖ 2x ‖
లేదు రక్షణ ఏ నామమున
లేదు పాప విమోచన‖ 2x పైనున్న ‖
Verse
అన్ని నామములకు పైని కలదు
ఉన్నతంబగు యేసుని నామము‖ 2x ‖
యేసు నామములో శక్తి కలదు‖ 2x ‖
దోషులకు శాశ్వత ముక్తి కలదు‖ 2x పైనున్న ‖
Verse
అలసి సొలసిన వారికి విశ్రం
జీవము లేని వారికి జీవము‖ 2x ‖
నాశనమునకు జోగేడి వారికి‖ 2x ‖
యేసు నామమే రక్షణ మార్గము‖ 2x పైనున్న ‖
Verse
యేసు నామము స్మరియించగానే
మనసు మారి నూతనమగును‖ 2x ‖
బేధమేమియు లేదెవ్వరికిని‖ 2x ‖
నాథుని స్మరియించి తరింప‖ 2x పైనున్న ‖