Verse
పైనున్న ఆకాశమందునా
క్రిందున్న భూలోకమందునా‖ 2x ‖
లేదు రక్షణ - యే నామమున
లేదు పాప విమోచన ఆ.. ఆ..‖ 2x ‖
Verse
అన్ని నామములకి - పైని కలదు‖ 2x ‖
ఉన్నతంబగు - యేసుని నామము‖ 2x ‖
యేసు నామములో - శక్తి గలదు
దోషులకు - శాశ్వత ముక్తి గలదు‖ 2x ‖
Verse
యేసు నామములో - నిత్యజీవం
శాశ్వతానంద - నిత్యశాంతి
యేసు నామములో - పాప శుద్ధి
విశ్వసించినచో - సమృద్ధి
Verse
అలసి సొలసిన - వారికి విశ్రం
జీవములేని వారికి జీవం
నాశనమునకు జోగేడి వారికి
యేసు నామమే - రక్షణ మార్గం
Verse
యేసు నామము - స్మరియించగానే
మనసు మారి - నూతన మగును
భేదమేమియు - లేదెవ్వరికిని
నాథుని స్మరియించి - తరింప