Chorus
పల్లవి: ఫలియించుట నేర్పయ్య నా యేసయ్యా
నీ నది తీరమున ఫలియించుట నేర్పయ్యా
నీ మందిరమున నివసించుట నేర్పయ్యా
నీ సన్నిధానమున వసియించుట నేర్పయ్యా
నీతో కలకాలం ఉండే భాగ్యం నాకు ఇవ్వయ్యా
Verse
యోసేపు వలె పాపము వద్దని
దుష్కార్యములు నాకు చెందవని
నీతివంతమైన జీవితము నాకు ఇవ్వయ్యా
పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వయ్యా
Chorus
పల్లవి: ప్రేమించుట నేర్పయ్య నా యేసయ్యా
శత్రువునైనా ప్రేమించుట నేర్పయ్యా
బంధువులందరిని ప్రేమించుట నేర్పయ్యా
రక్త సంబంధులును ప్రేమించుట నేర్పయ్యా
అందరి కన్నా నిను ప్రేమించే మనసు ఇవ్వయ్యా
Verse
యోసేపు వలె భాధింపబడిన క్షమియించే మనసు నాకు ఇవ్వయ్యా
దైవ ప్రేమతో హత్తుకునే మనసు ఇవ్వయ్యా
హృదయాన్ని ఆదరించే మాటలు నాకు నేర్పయ్యా