Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Palle Pallello Pattanala Moolallo

పల్లె పల్లెల్లో పట్టణాల మూలల్లో

Palle Pallello Pattanala Moolallo

Verse 1
పల్లె పల్లెల్లో పట్టణాల మూలల్లో
వాడ వాడల్లో సొగసైన మేడల్లో
యేసు వార్త చాటను పదరో తమ్ముడా
నాకేమి అనబోకురో
Verse
ఈ సువార్త అసలు వినని జనులెందరో
యేసు లేక నశియుంచు ప్రజలెందరో
ప్రకటించే బాధ్యత నీమీద ఉన్నది
దారి చూపే నికీయబడినది
యేసయ్యా నిజ దేవుడని ఎలుగెత్తి చాటరో
Verse
నువ్వు మాత్రం తెలుసుకొని ఊరుకుంటావా
సొంత పనులు చూసుకొంటూ సంతసిస్తావా
కోతెంతో వున్నా పనివారు లేరని
అడుగుచున్నాడేసు తన పని చేయమని
యేసయ్యను నమ్ముకోమని ఎలుగెత్తి చాటరో
Verse
రాకడకు గురుతులు కనిపించుచుండగా
అంతం అతి దగ్గరగా వచ్చుచుండగా
సమయం అసమయమనక సందేహపడక
దొరికిన అవకాశమేది జారవిడువక
యేసయ్య తిరిగొస్తాడని ఎలుగెత్తి చాటరో

Related Tags

GospelEvangelismMission