Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Palukaleni Naaku Paata Nerpinaavu

పలుకలేని నాకు పాట నేర్పినావు

Palukaleni Naaku Paata Nerpinaavu

Lyricist: Chinnakotla K S Paul
Verse
పలుకలేని నాకు పాట నేర్పినావు
చేతకాని నన్ను నీవే ఎన్నుకున్నావు
మనిషిగా మలచావు – ప్రేమతో పిలిచావు‖ 2x ‖
యేసయ్యా స్తోత్రమయా
యేసయ్యా స్తోత్రమయా‖ పలుకలేని ‖
Verse
కోడి తన రెక్కల క్రింద దాచినట్లు దాచినావు
నా తల్లి మరచినా నేను మరువనన్నావు‖ 2x ‖
ప్రతి ఉదయం వేకువనే
ఎదురు చూచు ప్రియుడవు నీవు‖ 2x ‖
ప్రతి క్షణము కాపరివై
కాయుచున్న దేవుడ నీవు‖ 2x యేసయ్యా ‖
Verse
అగాధ జలములు సైతం ఆర్పలేని ప్రేమ నీది
వెండి బంగారు కన్నా విలువైన ప్రేమ నీది‖ 2x ‖
ప్రతి పగలు మేఘమై
నీడనిచ్చుఁ దేవుడ నీవు‖ 2x ‖
ప్రతి రాత్రి దీపమై
వెలుగునిచ్చుఁ దేవుడ నీవు‖ 2x యేసయ్యా ‖

Related Tags

PraiseGraceTestimony