Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Pampumu Deva Deevenalatho Pampumu Da

పంపుము దేవా దీవెనలతోఁ పంపుము ద

Pampumu Deva Deevenalatho Pampumu Da

Lyricist: Pulipaka Jagannadhamu
Chorus
పంపుము దేవా దీవెనలతోఁ పంపుము దేవా పంపుము దయ చేతఁ
పతిత పావన నామ పెంపుగ నీ సేవఁ ప్రియమొప్ప నొనరింపఁ‖ బంపుము ‖
Verse
మా సేవ నుండిన మా వెల్తు లన్నియు యేసుని కొఱకు నీ వెసఁగ
క్షమియించుచుఁ‖ బంపుము ‖
Verse
వినిన సత్యంబును విమలాత్మ మది నిల్పి దినదినము ఫలములు దివ్య
ముగ ఫలియింపఁ‖ బంపుము ‖
Verse
ఆసక్తితో ని న్ననిశము సేవింప భాసురంబగు నాత్మ వాసి కెక్కఁగ
నిచ్చి‖ బంపుము ‖

Related Tags

PrayerBlessingService