Verse
పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా‖ 2x ‖
పంపుము దయ చేత పతిత పావన నామ
పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప‖ పంపుము ‖
Verse
మా సేవ నుండిన మా వెల్తు-లన్నియు‖ 2x ‖
యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు‖ పంపుము ‖
Verse
వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి‖ 2x ‖
దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప‖ పంపుము ‖
Verse
ఆసక్తితో ని-న్ననిశము సేవింప‖ 2x ‖
భాసురంబగు నాత్మ వాసి-కెక్కగ నిచ్చి‖ పంపుము ‖