Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paradeshula Mo Priyulara Mana Pura Ma

పరదేశుల మో ప్రియులారా మన పుర మ

Paradeshula Mo Priyulara Mana Pura Ma

Lyricist: Gollapalli Nathaniel
Verse
పరదేశుల మో ప్రియులారా మన పుర మిదిగా దెపుడు నిజముగఁ‖ పరదేశుల ‖
Verse
చిత్రవస్తువులు చెల్లెడి యెకవి చిత్రమైన సరిత లోకము‖ బరదేశుల ‖
Verse
సంత గొల్లు క్షమ సడలిన చందం బంతయు సద్దణఁగున్ నిజముగఁ‖ బరదేశుల ‖
Verse
స్థిర మని నమ్మకు ధర యెవ్వరికిని బరలోకమె స్థిరము నిజముగఁ‖ బరదేశుల ‖
Verse
మేడలు మిద్దెలు మేలగు సరకులు పాడైకనఁబడవే నిజముగఁ‖ బరదేశుల ‖
Verse
ధర ధాన్యంబులు దరగక మానవు పనిపాటలు పోయె నిజముగఁ‖ బరదేశుల ‖
Verse
ఎన్నినాళ్ళు మన మిలలో బ్రతికిన మన్నై పోవునుగా దేహము‖ పరదేశుల ‖
Verse
వచ్చితి మిచటికి వట్టి హస్తములఁ దెచ్చిన దేదియు లే దు గదా‖ పరదేశుల ‖
Verse
ఎట్లు వచ్చితిమి యీ లోకమునకు అట్లు వెళ్లవలయున్ మింటికిఁ‖ బరదేశుల ‖
Verse
యేసు నందు వి శ్వాసం బుంచిన వాసిగ నినుఁ జేర్చున్ బరమున‖ బరదేశుల ‖
Verse
యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా నిజముగ‖ బరదేశుల ‖

Related Tags

PilgrimageHeavenTransience