Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paradeshulamo Priyulaara Mana

పరదేశులమో ప్రియులారా మన

Paradeshulamo Priyulaara Mana

Verse
పరదేశులమో ప్రియులారా మన
పురమిది గాదెపుడు (నిజముగ)‖ 2x నిజముగ పరదేశుల ‖
Verse
చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి
చిత్రమైన సంత (లోకము)‖ 2x లోకము పరదేశుల ‖
Verse
సంత గొల్లు క్షమ సడలిన చందం
బంతయు సద్దణగన్ (నిజముగ)‖ 2x నిజముగ పరదేశుల ‖
Verse
స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని
బరలోకమే స్థిరము (నిజముగ)‖ 2x నిజముగ పరదేశుల ‖
Verse
మేడలు మిద్దెలు మేలగు సరకులు
పాడై కనబడవే (నిజముగ)‖ 2x నిజముగ పరదేశుల ‖
Verse
ధర ధాన్యంబులు దరగక మానవు
పని పాటలు పోయె (నిజముగ)‖ 2x నిజముగ పరదేశుల ‖
Verse
ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన
మన్నై పోవునుగా (దేహము)‖ 2x దేహము పరదేశుల ‖
Verse
వచ్చితి మిచటికి వట్టి హస్తముల
దెచ్చిన దేదియు లే (దు గదా)‖ 2x దు గదా పరదేశుల ‖
Verse
ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు
అట్లు వెళ్ళవలయున్ (మింటికి)‖ 2x మింటికి పరదేశుల ‖
Verse
యేసు నందు విశ్వాసం బుంచిన
వాసిగ నిను జేర్చున్ (బరమున)‖ 2x బరమున పరదేశుల ‖
Verse
యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవముగా (నిజముగ)‖ 2x నిజముగ పరదేశుల ‖

Related Tags

PilgrimageFaithHeavenTransience