Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paradeshulamo Priyulaaraa

పరదేశులమో ప్రియులారా

Paradeshulamo Priyulaaraa

Verse
పరదేశులమో ప్రియులారా మన
పురమిది గాదెపుడు (నిజముగ) 2x పరదేశుల‖ 2x పరదేశుల ‖
Verse
చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి
చిత్రమైన సంత (లోకము) 2x పరదేశుల‖ 2x పరదేశుల ‖
Verse
సంత గొల్లు క్షమ సడలిన చందం
బంతయు సద్దణగన్ (నిజముగ) 2x పరదేశుల‖ 2x పరదేశుల ‖
Verse
స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని
బరలోకమే స్థిరము (నిజముగ) 2x పరదేశుల‖ 2x పరదేశుల ‖
Verse
మేడలు మిద్దెలు మేలగు సరకులు
పాడై కనబడవే (నిజముగ) 2x పరదేశుల‖ 2x పరదేశుల ‖
Verse
ధర ధాన్యంబులు దరగక మానవు
పని పాటలు పోయె (నిజముగ) 2x పరదేశుల‖ 2x పరదేశుల ‖
Verse
ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన
మన్నై పోవునుగా (దేహము) 2x పరదేశుల‖ 2x పరదేశుల ‖
Verse
వచ్చితి మిచటికి వట్టి హస్తముల
దెచ్చిన దేదియు లే (దు గదా) 2x పరదేశుల‖ 2x పరదేశుల ‖
Verse
ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు
అట్లు వెళ్ళవలయున్ (మింటికి) 2x పరదేశుల‖ 2x పరదేశుల ‖
Verse
యేసు నందు విశ్వాసం బుంచిన
వాసిగ నిను జేర్చున్ (బరమున) 2x పరదేశుల‖ 2x పరదేశుల ‖
Verse
యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవముగా (నిజముగ) 2x పరదేశుల‖ 2x పరదేశుల ‖

Related Tags

HeavenHopeTransience