Chorus
పరలోక భూలోకంబులకును బ్రభువును సృష్టికర్తయునౌ పరమ శక్తుఁ
డౌ తండ్రి దేవుని భక్తితో నమ్ముచు నున్నాను‖ పరలోక ‖
Verse
ఆయన యద్వితీయ సుతుండౌ నా యేసుని నమ్ముచు నుందు నాయన
పరిశుద్ధాత్మ వలనఁ గ న్యా మరియమ్మకు జన్మించెఁ‖ పరలోక ‖
Verse
పొంతి పిలాతు అధికారంబునఁ బొంది సిలువ బాధను మృతుఁడై
యంతట భూస్థాపనముఁ జేయఁబడి యదృశ్య లోకమునకు దిగెను‖ పరలోక ‖
Verse
మరి మూఁడవ దినమునఁ జనిపోయిన మనుజులలో నుండియు లేచి
పరలోకంబున కెక్కి తండ్రి కుడి పార్శ్వంబునఁ గూర్చున్నాఁడు‖ పరలోక ‖
Verse
అక్కడ నుండి బ్రతికియున్న జను లందరిఁ జనిపోయినవారిఁ జక్కంగను
విమర్శించుటకును జను నని నమ్ముచునున్నాను‖ పరలోక ‖
Verse
పరిశుద్ధాత్మను నమ్ముచు నుందును బావన సార్వత్రిక సభను ధర
నైక్యతఁ బాపక్షమఁ బునరు త్థాన సుజీవము నమ్ముదు నామేన్‖ పరలోక ‖