Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paraloaka Raajyamu Chaerutaku Prabhuyaesae Maargmbu

పరలోక రాజ్యము చేరుటకు ప్రభుయేసే మార్గంబు

Paraloaka Raajyamu Chaerutaku Prabhuyaesae Maargmbu

Verse
పరలోక రాజ్యము చేరుటకు - ప్రభుయేసే మార్గంబు
మార్గ సత్య జీవము నేనేయని యేసే పల్కెను
Verse
సర్వలోకుల పాప - పరిహారార్థము శ్రీ యేసు
పరిశుద్ధ రక్తము చిందించి - బలియాయెను శ్రీ యేసు
Verse
పాపపరిహారార్థము - పావన రక్తము నిచ్చిన
యేసుని చేర ప్రియుడా - సంశయమదియేల
Verse
నిను ప్రేమించి ప్రాణము - నీకై పెట్టిన యేసుని
నాకు వలదంచు వెళ్ళుట - న్యాయమా ప్రియుడా
Verse
మరణించిన యేసు ప్రభువు - మూడవనాడు లేచెను
మహిమా ప్రభావముతో యేసు - మరణము గెల్చెను
Verse
తక్షణమే మారు మనస్సు - నొంది యేసును నమ్మిన
రక్షణ నొందెదవు - నిశ్చయముగనో - ప్రియుడా

Related Tags

GospelSalvationJesus