Verse
పరలోకము నా దేశము - పరదేశి నేనిల
మాయలోకమేగా - నేను యాత్రికుడను
Verse
ఎంతో అందమైనది పరలోకము
అసమానమైనది నా దేశము
ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును
Verse
దూతలు పాడుచుందురు - పరమందున
దీవారత్రములందు పాడుచుందురు
పావనుని చూచి నేను హర్షింతును నిత్యము
Verse
రక్షకుని చెంతకు - యెప్పుడేగెదను
వీక్షించెద నెప్పుడు - నాదు ప్రియుని
కామ్కించెద నా మదిలో - ఆయన చెంతనుండ
Verse
అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళెదన్
అగుపడు చున్నది గమ్యస్థానము
అచ్చటనే చూచెదను - పరిశుద్ధులెల్లరిన్
Verse
నిత్యానంద ముండును - పరమందున
నీతి సమాధానము - ఉండునచ్చట
పొందెదను విశ్రాంతిని - శ్రమలన్నియు వీడి