Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paralokame Naa Anthapuram

పరలోకమే నా అంతఃపురం

Paralokame Naa Anthapuram

Verse
పరలోకమే నా అంతఃపురం
చేరాలనే నా తాపత్రయం‖ 2x ‖
యేసుదేవరా – కనికరించవా – దారి చూపవా‖ 2x పరలోకమే ‖
Verse
స్వల్ప కాలమే ఈ లోక జీవితం
నా భవ్య జీవితం మహోజ్వలం‖ 2x ‖
మజిలీలు దాటే మనోబలం
నీ మహిమ చూసే మధుర క్షణం‖ 2x ‖
వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం – నాకు ఈయవా‖ 2x పరలోకమే ‖
Verse
పాపము నెదిరించే శక్తిని నాకివ్వు
పరులను ప్రేమించే మనసే నాకివ్వు‖ 2x ‖
ఉద్రేక పరచే దురాత్మను
ఎదురించి పోరాడే శుద్ధాత్మను‖ 2x ‖
మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం – నాకు నేర్పవా‖ 2x పరలోకమే ‖

Related Tags

HolinessFaithHeaven