Verse
పరలోకమే నా స్వాస్థ్యము
ఎపుడు గాంతునో‖ 2x ‖
నా ప్రియ యేసుని
నేనెపుడు గాంతునో‖ 2x పరలోకమే ‖
Verse
ఆకలిదప్పులు దుఃఖము
మనోవేదన లేదచ్చట‖ 2x ‖
పరమ మకుటము పొందను
ప్రభు పాదముల చేరెదను‖ 2x పరలోకమే ‖
Verse
సిలువ వేయబడితిని
ఇక నేకాదు జీవించుట‖ 2x ‖
ప్రభు యేసు మహిమ కొరకు
గురి గలిగి జీవింతును‖ 2x పరలోకమే ‖
Verse
నా పరుగు తుద ముట్టింప
నాకు కృపను మెండుగ నొసగును‖ 2x ‖
విశ్వాస మార్గములో
విసుగక పరుగెత్తెదను‖ 2x పరలోకమే ‖
Verse
పరమ విశ్రాంతి పొంద
పరలోకమందు చేరెదను‖ 2x ‖
పగలు రాత్రచ్చట లేదు
ప్రభువే దీపమై యుండును‖ 2x పరలోకమే ‖
Verse
ప్రియుని పిలుపును విని
నేను కూడా సిద్ధపడెదను‖ 2x ‖
దినములు సమీపించగా
వాంఛయు అధికంబాయె‖ 2x పరలోకమే ‖