Verse
పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో
నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో
Verse
ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట
పరమ మకుటము పొందను - ప్రభు పాదముల చేరెదను
Verse
సిలువ వేయబడితిని - ఇక నేకాదు జీవించుట
ప్రభు యేసు మహిమ కొరకు - గురి గలిగి జీవింతును
Verse
నా పరుగు తుదముట్టింప - నాకు కృపను మెండుగ నొసగును
విశ్వాస మార్గములో - విసుగక పరుగెత్తెదను
Verse
పరమ విశ్రాంతి పొంద - పరలోకమందు చేరెదను
పగలు రాత్రచ్చట లేదు - ప్రభువే దీపమై యుండును
Verse
ప్రియుని పిలుపును విని - నేను కూడా సిద్ధపడెదను
దినములు సమీపించగా - వాంఛయు అధికంబాయె