Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paralokamu Naa Deshamu

పరలోకము నా దేశము

Paralokamu Naa Deshamu

Lyricist: Songs Of Zion
Verse
పరలోకము నా దేశము
పరదేశి నేనిల మాయలోకమేగ
నేను యాత్రికుడను‖ 2x ‖
Verse
ఎంతో అందమైనది పరలోకము
అసమానమైనది నా దేశము‖ 2x ‖
ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును‖ 2x పరలోకము ‖
Verse
దూతలు పాడుచుందురు పరమందున
దీవా రాత్రమునందు పాడుచుందురు‖ 2x ‖
పావనుని చూచి నేను హర్షింతును నిత్యము‖ 2x పరలోకము ‖
Verse
రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్
వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని‖ 2x ‖
కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ‖ 2x పరలోకము ‖
Verse
అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్
అగుపడుచున్నది గమ్యస్థానము‖ 2x ‖
అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్‖ 2x పరలోకము ‖
Verse
నిత్యానందముండును పరమందున
నీతి సమాధానము ఉండునచ్చట‖ 2x ‖
పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి‖ 2x పరలోకము ‖

Related Tags

HeavenHopePilgrim