Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paralokamuna Nundu Deva Nee Padamula Ko

పరలోకమున నుండు దేవ నీ పదముల కొ

Paralokamuna Nundu Deva Nee Padamula Ko

Lyricist: Purushothamu Choudari
Verse
పరలోకమున నుండు దేవ నీ పదముల కొనరింతు సేవ దురితంబులకు
నేను వెఱచి యున్నానని కరుణించి నీ సుతుని ధర కంపితివి
గాదా అరయఁగా నీ ప్రేమ యింతనఁ దరము గాదో పరమ జనక
మరణ పర్యంతంబు నిను నే మరువఁ జాలను వరకృపా నిధి‖ పరలోక ‖
Verse
యేసుక్రీస్తుని దయసేయ కున్న మోస మొందెద నెందుకన్న
దోసంబులకు నేను దాసుండనై ప్రతి వాసరంబును నీదు భాసు
రాజ్ఞలు విడిచి వేసటలు గల నరకమునఁ బడ ద్రోసిన నది న్యాయమౌ
గద నా సునాధా పేర్మిచేతను నీ సుతుని నంపించినావు‖ పరలోక ‖
Verse
ఎన్నరాని మహిమ నుండి యేసు నన్నుఁ బాలింప నేతెంచి
యెన్న శక్యము గాక యున్న పాపములన్ని ఛిన్నాభిన్నము జేసి
నన్ను సమ్మతిపరప నన్న యగు నా రక్షకుండు తన్ను తానర్పించి
వెండియు నున్నతుండై లేచి యిప్పుడు సన్నిధానం బొసఁగె నాకుఁ‖ పరలోక ‖

Related Tags

WorshipSalvationGratitude