Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parama Daivame

పరమ దైవమే

Parama Daivame

Lyricist: A R Stevenson
Verse 1
యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించి
తిరిగి జన్మిస్తే
ఆయన కొరకు జీవించగలం
ఆయనను మనలో చూపించగలం
Chorus
పరమ దైవమే మనుష్య రూపమై
ఉదయించెను నా కోసమే
అమర జీవమే నరుల కోసమై
దిగి వచ్చెను ఈ లోకమే
క్రీస్తు పుట్టెను – హల్లెలూయ
క్రీస్తు పుట్టెను – హల్లెలూయ
క్రీస్తు పుట్టెను – హల్లెలూయా‖ 2x పరమ దైవమే ‖
Verse
ఆకార రహితుడు ఆత్మ స్వరూపుడు
శరీరమును ధరించెను
సర్వాధికారుడు బలాఢ్య ధీరుడు
దీనత్వమును వరించెను
వైభవమును విడిచెను – దాసునిగను మారెను –‖ 2x పరమ దైవమే ‖
దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా…
Verse
అనాది వాక్యమే కృపా సమేతమై
ధరపై కాలు మోపెను
ఆ నీతి తేజమే నరావతారమై
శిశువై జననమాయెను
పాపి జతను కోరెను – రిక్తుడు తానాయెను‖ 2x పరమ దైవమే ‖
భూలోకమును చేరెను – యేసు రాజుగా…
Verse
నిత్యుడు తండ్రియే విమోచనార్ధమై
కుమారుడై జనించెను
సత్య స్వరూపియే రక్షణ ధ్యేయమై
రాజ్యమునే భరించెను
మధ్య గోడ కూల్చను – సంధిని సమకూర్చను –‖ 2x పరమ దైవమే ‖
సఖ్యత నిలుప వచ్చెను – శాంతి దూతగా…

Related Tags

WorshipChristmas