Verse 1
Reference: క్రీస్తు భక్తిహీనులకొరకు చనిపోయెను. రోమా Romans 5:6
Verse
పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతోనుండా
నిరంతరము నడిపించును
మరల వచ్చి యేసు కొనిపోవును
Chorus
యేసు చాలును యేసు చాలును
యే సమయమైన యే స్థితికైనా
నా జీవితములో యేసు చాలును
Verse
సాతాను శోధనలధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగిననూ
లోబడక నేను వెళ్ళెదను‖ యేసు ‖
Verse
పచ్చిక బయలులో పరుండజేయున్
శాంతి జలముచెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్
మరణ లోయలో నన్ను కాపాడును‖ యేసు ‖
Verse
నరులెల్లరు నన్ను విడిచినను
శరీరము కుళ్లి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము
విరోధివలె నన్ను విడిచినను‖ యేసు ‖