Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parama Jeevamu Naaku Nivva Thirigi Lechenu Naatho Nunda

పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ

Parama Jeevamu Naaku Nivva Thirigi Lechenu Naatho Nunda

Verse
పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును - మరల వచ్చి యేసు కొని పోవును
Chorus
యేసు చాలును - యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
Verse
సాతాను శోధనలధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళదను
లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళదను‖ యేసు ‖
Verse
పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును‖ యేసు ‖
Verse
నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కుళ్ళి కృశించినను
హరిన్చినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను‖ యేసు ‖

Related Tags

FaithJesusResurrectionEaster