Chorus
పరమ నందుండెడు మా పరమ జనక నీదు పేరు పరిశుద్ధం బగును
గాక త్వరగను నీ రాజ్యంబు ధరకు నరుగు దెంచుఁగాక పరమునందు
నెట్టులనో ధరణియందు నట్లు నీ చి త్తంబు నెరవేరుఁగాక‖ పరమ ‖
Verse
మా యనుదినాహారము మాకు నేఁడు దయచేయుము మా యెడలను
దప్పిదములఁ జేయువారి నైఁచునట్లు మాయపరాధము క్షమించి మము
శోధనలోకిఁ దేక మహిని గీడు నుండి నీ స హాయమున దప్పించుము రా
జ్యమ్ము శక్తి మహిమము నె ల్లప్పుడును నీవె యామేన్‖ పరమ ‖