Verse 1
Reference: మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక 1 పేతురు Peter 1:3
Chorus
పరమ పవిత్ర స్వర్గపిత - జై ప్రభు జై ప్రభు - సర్వ సదా
యుగయుగములకు - రక్షకుడా - మమ్ములను రక్షించితివి
జీవుండ ప్రభు పాపుల రక్షకా - జై ప్రభు
Verse
ప్రేమరూపి నీవే - నన్ను ప్రేమించితివి
శ్రమలను పొందితివి - నీ ప్రేమ మూలమున
Verse
ప్రాణమిడి సిలువన్ - నన్ను రక్షించితివి
పాపము తీసితివి - నీ కౄప ఉన్నతము
Verse
శత్రు సైతానున్ - ఓడించితివీవు
నీ మరణము వలన - విమోచించితివి
Verse
శక్తిగలవాడా - చావున్ గెల్చితివి
శక్తితో లేచితివి - తండ్రితో కలిపితివి
Verse
ప్రేమగల ప్రభువా - మరల వచ్చెదవు
శ్రమలను తొలగించి - నను చేర్చుకొందువు
Verse
ప్రవాహములోన - ప్రభు నేనుండినను
నిన్ను బట్టి నే - క్షేమముగా నుందున్
Verse
జై జై యని పాడుడి - యేసునకే మహిమ
జై జై హల్లెలూయా - జై జై హల్లెలూయా