Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parama Prabho Yesurakshaka Dhananarula B

పరమ ప్రభో యేసురక్షకా ధననరుల బ్

Parama Prabho Yesurakshaka Dhananarula B

Lyricist: Banyan Joseph
Chorus
పరమ ప్రభో యేసురక్షకా ధననరుల బ్రోచి పరమ కారోహణంబైతివా
మరియయందు జననమొంది వరము లిడుచు దిరిగిధరను మరణమొంది
తిరిగిలేచి పరము కేగితివా ప్రభో‖ పరమ ‖
Verse
ఘోర పాపభారముతోడ దరిగానలేకఁ దిరుగుచుండినట్టి మమ్మును
కూరిమితోఁ దరికిఁబిలిచి భారమును నీవేమోసి ఊరకమము క్షమియించి
నేరములను బాపిన ప్రభో‖ పరమ ‖
Verse
సిలువమరణమొందినఁ ప్రభువా ఇలనరుల ఘోర కలుషములను బాపిన
ప్రభువా విలువలేని నీదు బ్రతుకు బలముగల నీ ప్రేమ సేవ సలితముగ
ననుకరించి ఇలను మేము బ్రతుకునట్లు‖ పరమ ‖
Verse
చెఱను చెఱగఁబట్టిన ప్రభువా ధనరులకెల్ల వరములను విరివి నిడితివా
పరముకేగి పరమతండ్రి పరమున కుడిపార్శ్వమందుఁ దిరముగాఁ
గూర్చుండి యుండి తిరిగి ధరకు వచ్చెదవా‖ పరమ ‖
Verse
నీదు రాక కెదురుజూచెడి నీ దాసులను సదయతతో జూడుమో ప్రభో
మాదినపు ప్రార్థనలను మాదు స్తోత్రములను మిగులఁ బ్రోదిగా గైకొనుచు
నేడు బ్రోవుమయ్య మమ్ములను‖ పరమ ‖
Verse
పంపుమయ్య నీదు ఆత్మను పదిలముగ దయతో సొంపుగ నీ శుద్ధాత్మను
నింపుమయ్య నీదు కృపతో ఇంపగు నీవరములతో సొంపు గాను నీదు
సేవ జేయనిలను నెల్లపుడు‖ పరమ ‖

Related Tags

WorshipJesus ChristAscension