Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parama Raajyamunaku Narulu Thirigi Pu

పరమ రాజ్యమునకు నరులు తిరిగి పు

Parama Raajyamunaku Narulu Thirigi Pu

Lyricist: Thupili Rangayya
Chorus
పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు ననుచుఁ బరమ
గురువు యేసు క్రీస్తు స్థిరము చేసెను‖ పరమ ‖
Verse
వేదశాస్త్ర మెఱిఁగినట్టి యూదుల యధికారియౌ ని కోదే మనెడు
పరిసయుండు మదిని దలఁచుచున్‖ పరమ ‖
Verse
అతఁడు రాత్రివేళఁ ప్రభుని వెతకి పోయి యెదుట స మ్మతిని నిలిచి
పిలిచి పల్కె హితవుతోడను‖ పరమ ‖
Verse
బోధకుండ నీవు మోక్ష నాధుఁడౌ యెహోవ యొక్క వేద వార్తఁ జెప్పెదవు
నీ బోధ నెఱుఁగుదున్‖ పరమ ‖
Verse
మఱియు నీవు చేయుచున్న గురుతు లెవ్వరైన దైవ వరము లేని యట్టి
పాప నరులు చేయరు‖ పరమ ‖
Verse
అనుచుఁ బరిసయుండు పల్క వినుచు యేసు కనికరమునఁ దనకు
నిట్లు దెలిపెఁ జాలి మనసుతోడను‖ పరమ ‖
Verse
క్రొత్త జన్మ మెవ్వఁడైన నెత్త కున్న మోక్షమమునకు నెత్తఁబడఁ డటంచు
నిజము క్రీస్తు పల్కెను‖ పరమ ‖
Verse
వినుచుఁ బరిసయుండు ముసలి జనుఁడు మఱల తల్లి గర్భ మునను
తిరుగనెట్లు బుట్టు ననుచుఁ బల్కెను‖ పరమ ‖
Verse
అందు కేసు తెల్పె జలము నందుఁ నాత్మయందు జన్మ మొంద కున్న
మోక్ష రాజ్య మొంద రనుచును‖ పరమ ‖

Related Tags

SalvationBaptismRebirth