Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parama Rakshaka Yesu Prabhuvaa Ne Nee Pa

పరమ రక్షక యేసు ప్రభువా నే నీ ప

Parama Rakshaka Yesu Prabhuvaa Ne Nee Pa

Lyricist: Ravuri Rangayya
Verse
పరమ రక్షక యేసు ప్రభువా నే నీ పాలఁ పడితి పాలన సేయవే
ధరజనంబులుసేయు బహువిధ దురితములు క్షమియించి సద్గతి తెరవు
జూపి తరింపఁజేసెడి దొరవటంచును మరుగుజోచ్చితి‖ పరమరక్షక ‖
Verse
క్షితి నబ్ధి తీర పై కతయైన నెన్ననా యితియౌను లెక్కింపఁగా
కుతల జన్మంబెత్తియేనిట బ్రతుకు దినముల జేయునఘములు మతి
దలపనిమితా యుతంబులు పతితు డనునాగతి యెరుంగను‖ పరమరక్షక ‖
Verse
పసలేని మాయా దు ర్వ్యసనంబులను జెంది దెసదప్పి యున్నాఁడను
వసుధలో దుష్టునికి లోఁబడి మసలజాలని బలహీనత గసటు కన్నులగప్పి
కడు మా నసము దూలి విలాపినైతిని‖ పరమరక్షక ‖
Verse
మదితప్పి గొఱ్ఱెల మంద బాసినగొఱ్ఱె చెదరి చలించినట్లు వదలకెపుడు
దురాత్మలైరి స ముదయమునఁ బడితిరిగి వడిచెడి మదికి విశ్రమమేమి
లేమిని హృదయ సంతాపముల సుడిఁబడి‖ పరమరక్షక ‖
Verse
మదపున్నాగము భంగి మత్తిల్లి దుర్భావ హృదయుఁడనై చెడితిని
గొదగొనుచు గాయములతో నా యెద దృఢంబించుకయు లేమినిఁ గదల
శక్యము గాక మూల్గుచు గొదువలకు లోనైతి ద్రోహిని‖ పరమరక్షక ‖
Verse
అమిత దురాత్ముఁడ నని కడఁ ద్రోయక క్షమియింపు మీ కరుణచే
తమిని మిక్కిలి దుర్విషయగుణ సముదంబులు జుట్టి పాపపు తమము గప్పియు
గలుషకానన సమితిలోఁబడి శ్రమలు నొందుచు‖ పరమరక్షక ‖

Related Tags

PrayerRepentanceSalvation