Chorus
పరమ తండ్రి నిన్ను మే మీ పరస కాలము స్వరము లెత్తి యింపు
గాను స్మరణఁ జేతుము‖ పరమ ‖
Verse
నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో హరువుగా నుతింతు మేము
హర్స రవముతోఁ‖ పరమ ‖
Verse
అవని సంభ్రమములలోన నవఘళించము అవసరముగ నీదు పలుకు
నవధరింతుము‖ పరమ ‖
Verse
వేయి నాళ్లు లోకమునను వెలయుకంటెను శ్రేయ మొక్కనాఁడు నిన్ను
సేవ జేయుట‖ పరమ ‖
Verse
ఉచితమైన నీ గృహమున నచల భక్తితో రుచిరమైన నీదు ప్రేమ
రుచినిజూతుము‖ పరమ ‖
Verse
మనసునందు సత్యబోధ మనస్కరించుచు మనెడు తరిని విడము నీదు
ఉనికిపట్టును‖ పరమ ‖
Verse
గొరియ పిల్ల యొక్క ప్రేమ గూర్చి భక్తితోఁ గొరత లేక చేతు మెపుడు
గొనబు గానము‖ పరమ ‖
Verse
శాంతజలము నొద్ద మమ్ము శాంతి పరచుము సంతతమును నీవు
మమ్ము సంతరించుము‖ పరమ ‖
Verse
దినము లన్ని మేము నిన్ను దీన మనసుతో వనరు మాని సంతసమున
వినతి చేతుము‖ పరమ ‖