Verse
పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే - పాపి కొరకై
Verse
వినుము సోదరా - వింతవార్తను దేవదేవుడే - త్యాగమాయెను
ఆ - దేవుడే దయతో నన్ను వెదకి వచ్చెగా
Verse
కల్వరి ప్రభున్ - గాంచు సోదరా వ్రేలాడెను - యేసునాథుడు
నా - పాపముల్ సిలువలో మోసె నేసు కల్వరిన్
Verse
దేహమంతయున్ - గాయమొందెనే నా రోగమున్ బాగుచేసెనే
నా శాపమున్ బాపెను మోసె నెల్ల బాధలన్
Verse
మహిన్ ప్రేమచే - మహిమ విడచెనే - మాత వలెనే - మమ్ము బ్రోచెనే
ఇ - మ్మహియందు ఎన్నడున్ కాననట్టి కార్యమే
Verse
యేసు ప్రభుకై - ఏమి చేతును - దీన మనసుతో - సేవజేతును
నన్ - నిరతము గాచును ఎల్లవేళ కొల్లగన్