Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paramaasheervaadhamu Koari Paraloaka Pithaa Arudhemchithimi

పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదెంచితిమి

Paramaasheervaadhamu Koari Paraloaka Pithaa Arudhemchithimi

Verse 1
Reference: యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక సంఖ్యా Numbers 6:24
Chorus
పరమాశీర్వాదము కోరి - పరలోక పితా అరుదెంచితిమి
Verse
తండ్రీ యోగ్యతలేని మాకు నేడే దయచేయుము నీశక్తి
హృదయముల ఖాళీజేసి పరలోక పితా అరుదెంచితిమి
Verse
ఎన్నెన్నో పాపాలు జేసి అపరాధమున సిగ్గునొంది
మాదు శిరములను వాల్చి పరలోక పితా అరుదెంచితిమి
Verse
బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వశక్తియు నీవే
నిన్నే సదా స్తుతియించెదము పరలోక పితా అరుదెంచితిమి
Verse
ఇలలో శ్రమలనోర్చిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నాము
నీ దాసులను మరువకుము పరలోక పితా అరుదెంచితిమి

Related Tags

WorshipPrayerBlessing