Chorus
పరమేదేశ మిదిగో నూతన యెరూస లేమదిగో సోదర తిర మగు
పురమది దివ్య సుందరము తరముగాదు త ద్దయు వర్ణింపగ‖ బరమ ‖
Verse
ద్వాదశ రత్నములా ప్రోలుపు నాదులుగా నుండు సోదర యాదట
దీరక నాణి ముత్తియ వి నోదద్వారముల నమరి వెలయు‖ బరమ ‖
Verse
శుద్ధ సువర్ణమున నెంతో శుద్ధి మార్గముండు సోదర శుద్ధు లెల్ల
బరి శుద్ధ గానముల శుద్ధుని నెప్పుడు స్తుతి యొనరింతురు‖ బరమ ‖
Verse
పరమ జనకు సముఖం బచ్చట నరులతోడ నుండన్ సోదర
నరులు దేవుని నరులై యుందురు పరమాత్ముడు దన వారలతో నుండును‖ బరమ ‖
Verse
కన్నీరుండదుగా దేవుఁడు గన్నుల దుడుచునుగా సోదర యెన్నఁగ
మరణం బిక నుండదు మరి చెన్నుగ భేదము శీఘ్రము దొలఁగును‖ బరమ ‖
Verse
పరమపురమునందు దేవుని కిరవొకటుండదుగా సోదర పరమ
జనకుడును గొఱ్ఱె పిల్లయును మురువుగ నొక మందిరమై యుందురు‖ పరమ ‖
Verse
రవి చంద్రులతోడన్ నిజముగ నవసరముండదుగా సోదర
యవిరతముగ యే సువె ఘనతరవై భవమై ప్రభతో బరగుచు నుండును‖ పరమ ‖
Verse
సంతతంబిచ్చోట సాధులు స్తుతి సేతురు దేవున్ సోదర
యతులితంబుగా హర్షమకుటమును సతతము దాల్తురు స్వామి సన్నిధిని‖ పరమ ‖
Verse
ఆఁకలియుండదుగా నిజముగా నాకుల ముండదుగా సోదర
ప్రాకటముగ జీ వ జలంబచ్చట నీకు నొసంగును నిరతము వరదుఁడు‖ పరమ ‖
Verse
ప్రభు సన్నిధినుండి పారును శుభనది సుఖ మియ్యన్ సోదర
యుభయ తీరముల నుండు తరులు సౌ రభ దీప్తిని శుభ రక్షణ ఫలమిడు‖ బరమ ‖