Chorus
పరమతండ్రి కరములెత్తి - స్తుతుల నర్పింతుము
శిరములెత్తి స్వామి నీకై చూచుచుంటిమి
ఉజ్జీవ నాత్మ నొసగు నిలువ సజీవ సాక్షిగ
Verse
పాప శాపములందు మేము - పడి చెడి యుండగా
దేవ మాదు దరికి జేరి - లేవ నెత్తితివి
ఎంత జాలి ఎంత ప్రేమ - స్తుతుల నర్పింతుము
Verse
దినదినము నిను శోధించి - దుఃఖ పెట్టితిమి
కేవలము శరీరులమని - కనికరించితివి
క్షమించి మమ్ము కడిగితివి - స్తుతుల నర్పింతుము
Verse
నింద వేదన శ్రమలు బహు - నిట్టూర్పులయందు
విసుగకుండ సేవచేయ - నొసగు నోర్పును
నింపు నీ శుద్ధాత్మతోను - స్తుతుల నర్పింతుము
Verse
సూర్యచంద్ర తారలందు - వింత సూచనలు
జరుగ జనులు ధైర్యము చెడి - కూలి చూచెదరు
అయితే నీకై చూచు మేము - బలము నొందెదము
Verse
సమాజముగ కూర్చి నీదు - సన్నిధియందు
ప్రార్థన సహవాసములలో - స్థిరులజేయుము
తేరి చూస్తూ నీ రాకడకై - స్తుతుల నర్పింతుము
Verse
శత్రుటురులు త్రుంచివేసి - జీవమిచ్చితివి
ఆహా! యేమర్పింతుము - నీ ఉపకారములకై
చేతబట్టి రక్షణపాత్ర - స్తుతుల నర్పింతుము
Verse
గతబ్రతుకులో వాత్సల్యమున - గాచి యీ క్షితిన్
నడిపె నవ్యవత్సరముకై - కృపాక్షేమములతో
సత్యుడ సిల్వశక్తి నొసగు - సాగముందుకు