Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paramu Dhigenu Mahima Nindenaalo Siluva Yoddha Svasthatha Kaligenu

పరము దిగెను మహిమ నిండెనాలో సిలువ యొద్ద స్వస్థత కలిగెను

Paramu Dhigenu Mahima Nindenaalo Siluva Yoddha Svasthatha Kaligenu

Verse
హా! ఎంత అద్భుతాశ్చర్య దినము - ఎన్నడు మరువని దినం
నే చీకటిలో తిరిగినపుడు యేసు నన్ను సంధించె
హా! ఎంత జాలిగల మిత్రుడు హృదయ అక్కరతీర్చెను
మరణచ్చాయలు పోయె ముదమున తెలిపెద - చీకటినంత బాపెన్
Chorus
పరము దిగెను మహిమ నిండెనాలో
సిలువ యొద్ద స్వస్థత కలిగెను
నా పాపం కడిగెను రాత్రి పగలై మారెను
పరము దిగెను మహిమ నిండెనాలో
Verse
పరిశుద్ధ ఆత్మతో జన్మించితివి దేవుని గృహమందు
కల్వరి ప్రేమచే కల్గెనీతి ఓ ఎంత ఔన్నత్యము
తీర్మానము జరిగె వేగముగా పాపిగా నేను రాగా
కృపనిచ్చె దాని నే స్వీకరించగా రక్షించెను స్తోత్రము
Verse
నిశ్చయముగ పరమందున్న కాలము తీరగనే
భవనములు నాకందున్నవని స్థిరముగనే నమ్ముదున్
నమ్మి సిలువనే చేరిననాడే అదియే అద్భుతదినం
నిత్యైశ్వర్యమీ దీవెనలు పొందితి ప్రభు హస్తమునుండి

Related Tags

SalvationCrossGlory