Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paramuloana Baramuloanao Paapa Memi Leadu

పరములోన బరములోనఁ పాప మేమి లేదు

Paramuloana Baramuloanao Paapa Memi Leadu

Lyricist: Gollapalli Nathaniel
Verse
పరములోన బరములోనఁ పాప మేమి లేదుగా నరయ దానిఁ గోరు
వారి కాశ యిందు లేదుగా‖ పరములోన ‖
Verse
వృద్ధ సర్చ మనెడు వాని సుద్ధు లందు లేవుగా సద్దులేని చోట నెపుడు
స్వామి సేవ గల్గుగా‖ పరములోన ‖
Verse
ఎల్ల రోగ శ్రమలు మనకు నీ స్థలంబులోనెగా కల్లగాదు క్రీస్తు మనకుఁ
గంటి నీళ్లు దుడుచుఁగా‖ పరములోన ‖
Verse
అంధకారమైన కార్యము లా స్థలమున లేవుగా సందె వెలుఁగు వెలుగు
నట్లు స్వామి సన్నిధి యుండుఁగా‖ పరములోన ‖
Verse
దొంగవాని వలన మనకు దోపు లేమి లేవుగా యంగలార్పుఁ దీర్చి
క్రీస్తుఁ ఆశ్రయముగ నిల్చుఁగా‖ పరములోన ‖
Verse
అన్నపానములందు మనకు నాశ యేమి లేదుగా కన్న తండ్రి కన్న
మిగుల ఘనుని ప్రేమ గల్గుగా‖ పరములోన ‖

Related Tags

HeavenSalvationEternity