Verse
పరవాసిని నే జగమున ప్రభువా‖ 2x ‖
నడచుచున్నాను నీ దారిన్
నా గురి నీవే నా ప్రభువా‖ 2x ‖
నీ దరినే జేరెదను
నేను.. నీ దరినే జేరెదను‖ పరవాసిని ‖
Verse
లోకమంతా నాదని యెంచి
బంధు మిత్రులే ప్రియులనుకొంటిని‖ 2x ‖
అంతయు మోసమేగా‖ 2x ‖
వ్యర్ధము సర్వమును
ఇలలో.. వ్యర్ధము సర్వమును‖ పరవాసిని ‖
Verse
ధన సంపదలు గౌరవములు
దహించిపోవు నీలోకమున‖ 2x ‖
పాపము నిండె జగములో‖ 2x ‖
శాపము చేకూర్చుకొనే
లోకము.. శాపము చేకూర్చుకొనే‖ పరవాసిని ‖
Verse
తెలుపుము నా అంతము నాకు
తెలుపుము నా ఆయువు యెంతో‖ 2x ‖
తెలుపుము ఎంత అల్పుడనో‖ 2x ‖
విరిగి నలిగియున్నాను
నేను.. విరిగి నలిగియున్నాను‖ పరవాసిని ‖
Verse
ఆ దినము ప్రభు గుర్తెరిగితిని
నీ రక్తముచే మార్చబడితిని‖ 2x ‖
క్షమాపణ పొందితివనగా‖ 2x ‖
మహానందము కలిగే
నాలో.. మహానందము కలిగే‖ పరవాసిని ‖
Verse
యాత్రికుడనై ఈ లోకములో
సిలువ మోయుచు సాగెదనిలలో‖ 2x ‖
అమూల్యమైన ధనముగా‖ 2x ‖
పొందితిని నేను
యేసునే.. పొందితిని నేను‖ పరవాసిని ‖
Verse
నా నేత్రములు మూయబడగా
నాదు యాత్ర ముగియునిలలో‖ 2x ‖
చేరుదున్ పరలోక దేశము‖ 2x ‖
నాదు గానము ఇదియే
నిత్యము.. నాదు గానము ఇదియే‖ పరవాసిని ‖