Verse
పరవశించెద నీ వాక్యములో
పరవశించి నే పాడెద నీ సన్నిధిలో‖ 2x ‖
నీ వాక్యమే నన్ను బ్రతికించినది
నీ వాక్యమే నన్ను నడిపించినది‖ 2x ‖
ఆరాధన స్తుతి ఆరాధన
నా ప్రాణమైన దేవా నీకారాధన‖ 2x ‖
Verse
నీ పాద సన్నిధిలో నేనున్నపుడు
వాక్యమనే పాలతో నను పోషించితివి‖ 2x ‖
నీ వాక్యమే నాకు సత్యము జీవము
నీ వాక్యమే నా పాదములకు దీపము‖ 2x ఆరాధన ‖
Verse
ఈ లోక బంధాలు కృంగదీసినపుడు
వాక్యమనే నీ మాటతో నన్నాదరించితివి‖ 2x ‖
నీ వాక్యమే నను బలపరచినది
నీ వాక్యమే నీలో స్థిరపరచినది‖ 2x ఆరాధన ‖