Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parimalathailam Neeve

పరిమళతైలం నీవే

Parimalathailam Neeve

Lyricist: John Wesley
Verse
పరిమళతైలం నీవే
తరగని సంతోషం నీలో
జీవన మకరందం నీవే
తియ్యని సంగీతం నీవే
Pre-Chorus
అ. ప:
Chorus
తరతరములలో నీవే
నిత్యసంకల్ప సారధి నీవే
జగములనేలే రాజా
నా ప్రేమకు హేతువు నీవే
ఉరుముతున్న మెరుపులవంటి
తరుముచున్న శోధనలో
నేనున్నా నీతో అంటూ నీవే
నాతో నిలిచినావు
క్షణమైనా విడువక ఔదార్యమును
నాపై చూపినావు
నీ మనసే అతి మధురం
అది నా సొంతమే..
Verse
చీల్చబడిన బండనుండి నా
కొదువ తీర్చి నడిపితివి
నిలువరమగు ఆత్మ శక్తితో
కొరతలేని ఫలములతో
నను నీ రాజ్యమునకు పాత్రుని
చేయ ఏర్పరచుకొంటివి
నీ స్వాస్థ్యములోనే చేరుటకై
అభిషేకించినావు
నీ మహిమార్ధం వాడబడే
నీ పాత్రను నేను..
Verse
వేచియున్న కనులకు నీవు
కనువిందే చేస్తావని
సిద్ధపడిన రాజుగా నీవు
నాకోసం వస్తావని
నిను చూచిన వేళ నాలో ప్రాణం
ఉద్వేగభరితమై
నీ కౌగిట ఒదిగి ఆనందముతో
నీలో మమేకమై
యుగయుగములలో నీతో
నేను నిలిచిపోదును

Related Tags

PraiseWorship