Verse 1
పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ యురుతరచిత మహిమతేజ
వరస్తుతి సల్పెదము రాజ
Verse
జనక సుత శుద్ధాత్మ యను పేరిట యేకాత్మ ఘనతర సంరక్ష ప్రేమ
ననిపి మము కనికరించు‖ పరమ ‖
Verse
నీవే మా ప్రాపువంచు నెరనమ్మి యందు మంచు భావంబున దలఁచు
వారిఁ బావనులఁ జేయు సదా‖ పరమ ‖
Verse
కలుషంబులను హరింప నిల సైతానును జయింప బలుమారు నిను
దలంచు బలము గల ప్రభుఁడ వీవే‖ పరమ ‖
Verse
ఈ లోక పాపనరులు చాల నిను నమ్మి మరల దూలిచే దారుణ సై
తానును బడఁద్రొక్కివేయు‖ పరమ ‖
Verse
అల్పా ఓ మేగయును నాద్యంతంబులును కల్పాంత స్థాయువైన కర్తా
కరుణించు మమును‖ పరమ ‖